గుడిసె దగ్ధం వృద్ధ మహిళకు గాయాలు | hut gutted in fire | Sakshi
Sakshi News home page

గుడిసె దగ్ధం వృద్ధ మహిళకు గాయాలు

Feb 16 2015 12:27 PM | Updated on Sep 5 2018 9:45 PM

ఇంటి పై నుంచి వెళ్తున్న కరెంట్ తీగల్లో మంటలు చేలరేగి గుడిసె దగ్ధమైంది.

ఆదిలాబాద్: ఇంటి పై నుంచి వెళ్తున్న కరెంట్ తీగల్లో మంటలు చేలరేగి గుడిసె దగ్ధమైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. లింగాపూర్ గ్రామానికి చెందిన ముసుగు పోసాని(70) అనే వృద్ధ మహిళ గుడిసె మంటల్లో ఇరుక్కొవడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. విషయం తెలిసిన రెవిన్యూ అధికారి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వృద్ధ మహిళకు ఆర్థిక సాయం చేస్తామని హామినిచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement