‘నా భార్యను వెనక్కి రప్పించండి’

Husband Request to Foreign Ministry For His Wife Back from Kuwait - Sakshi

చార్మినార్‌: కువైట్‌ దేశంలో ఇబ్బందులు పడుతున్న తన భార్యను వెంటనే నగరానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని పాతబస్తీ రెయిన్‌బజార్‌కు చెందిన ఓ వ్యక్తి విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను కోరుతున్నారు. తన భార్యకు వేతనం ఇవ్వకపోగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సంబంధిత ట్రావెల్‌ ఏజెంట్‌పై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రెయిన్‌బజార్‌ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ ఆయూబ్, సిరాజ్‌ బేగం దంపతులు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అతను స్థానిక ట్రావెల్‌ ఏజెంట్‌ మహ్మద్‌ ఎక్బాల్, అతడి భార్య షజహాన్‌ బేగం ద్వారా గత డిసెంబర్‌ 8న కువైట్‌కు పంపాడు. అప్పటి నుంచి ఆమె కువైట్‌లో నరకయాతన అనుభవిస్తుందన్నారు. తల్లి కనిపించకపోవడంతో చిన్నారులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. ఆమెకు జీతభత్యాలు ఇవ్వకపోగా.. దౌర్జన్యం చేస్తున్నారని.. వెంటనే తన భార్యను నగరానికి రప్పించడంతో పాటు ట్రావెల్‌ ఏజెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top