నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపునకు భారీ స్పందన లభించింది.
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపునకు భారీ స్పందన లభించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వికలాంగులు శిబి రానికి తరలిరాగా, అధికారులు నాలుగు కౌం టర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. నలుగురు వైద్యు లు వికలాంగులకు పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో మొత్తం 1,613 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్‌డీఏ ఏపీఓ జయలక్ష్మి తెలిపారు. వికలత్వ పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే ధ్రువీకరణ పత్రాలను ఆయా మండలాలకు పంపుతామని ఆమె వెల్లడిం చారు.
అర్హులందరికీ పింఛన్‌లు
అర్హులైన ప్రతి వికలాంగునికి రూ.1,500 పింఛన్ వచ్చేలా కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమె సదరం క్యాంపును సందర్శించారు.ఈ సందర్భంగా దరఖాస్తులు స్వీకరణ కౌంటర్లు, వైద్య పరీక్షలు చేసే కౌంటర్లను పరి శీలించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్, ఎంపీడీఓ ల క్ష్మీబాయి, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెం ట్ సురేష్‌బాబు, నగేష్ , నవాజ్ పాల్గొన్నారు.