చంద్రబాబు హామీ: వేతనాలు, పెన్షన్లకు ఎదురుచూపులే | Chandrababu Govt Failed to give salaries and pensions every month timely | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హామీ: వేతనాలు, పెన్షన్లకు ఎదురుచూపులే

Dec 2 2025 10:22 AM | Updated on Dec 2 2025 10:23 AM

Chandrababu Govt Failed to give salaries and pensions every month timely

సాక్షి, అమరావతి: ఉద్యోగులకు జీతాలు, పెన్ష­నర్లకు పెన్షన్‌ ప్రతి నెలా 1వ తేదీన ఇస్తామన్న చంద్రబాబు హామీ ఒక నెల ముచ్చటగానే మిగిలి­పోయింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత తొలి నెల మాత్రమే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇచ్చింది. ఆ తరువాత నుంచి ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగులు, పెన్షన్ల కోసం రిటైర్డ్‌ ఉద్యో­గులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నెల రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మాత్రమే సోమవారం వేతనాలు పడ్డాయి. మిగతా శాఖల ఉద్యోగులకు వేతనాలు పడలేదు. 

మున్సిపాలిటీ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగికీ జీతాలు రాలేదు. పెన్షనర్లకు పెన్షన్లు కూడా పడలేదు. తక్కు­వ జీతాలతో పనిచేసే హోంగార్డులు, వీఆర్‌ఏలకు కూడా 1వ తేదీన జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కో­నెల ఐదు, ఆరు తేదీలు వచ్చినా ఉద్యోగుల­కు జీతాలు ఇవ్వడం లేదని, చంద్రబాబు హామీ ఒక నెలకే పరిమితమైందని ఉద్యోగవర్గాలు పేర్కొ­ంటున్నాయి. 

ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు, పెన్ష­న్లు ఇస్తున్నామని చేస్తున్న ప్రచారంలో వాస్త­వం లేదని చెబుతున్నాయి. ప్రతి నెలా జీతాలు, పెన్షన్లకోసం 10వ తేదీ వరకు వేచిచూడాల్సి వస్తో­ందని ఉద్యోగులు, పెన్షనర్లు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3 వేల కోట్ల అప్పు చేయనుంది. ఆ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరేవరకు జీతాలకు, పెన్షన్‌కు ఆగాల్సిందేనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement