కోర్టు ధిక్కరణపై హైకోర్టు విచారణ

High Court Order To Assembly Secretary To Field Counter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ పెట్టిన కోర్టు ధిక్కరణ కేసుపై ఉమ్మడి హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ నెల 27న కౌంటర్‌ దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీని, లా సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. లా సెక్రటరీ తరుఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌, అసెంబ్లీ సెక్రటరీ తరుఫున సాయికృష్ణ కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసనసభా సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించడం లేదని పిటిషనర్‌ తరుపున న్యాయవాది వాదించారు. తీర్పు స్పష్టంగా ఉందని, ప్రభుత్వ సమాధానం చూసిన తర్వాత  స్పందిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ బీ. శివశంకర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం విధించిన తమపై విధించిన బహిష్కరణ చట్ట విరుద్ధమంటూ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సపత్‌ కుమార్‌లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బహిష్కరణ చెల్లదని, వారి సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించకపోవడంతో మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top