‘రాజన్న’ భక్తులకు హెలికాఫ్టర్‌ సదుపాయం | Helicopter Services For Vemulawada Jatara | Sakshi
Sakshi News home page

వేములవాడకు హెలికాఫ్టర్‌ సదుపాయం

Feb 20 2020 2:31 PM | Updated on Feb 20 2020 2:43 PM

Helicopter Services For Vemulawada Jatara - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : శివరాత్రి సందర్భంగా వేములవాడకు వెళ్లే భక్తులకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి 23 వరకు హైదరాబాద్‌ నుంచి వేములవాడ వెళ్లడానికి హెలికాప్టర్‌ సదుపాయాన్ని కల్పించింది. హైదరాబాద్‌ నుంచి వేములవాడకు వెళ్లి తిరిగి రావడానికి టికెట్‌ ధర రూ.30వేలుగా నిర్ణయించారు. ఈ మేరకు గురువారం బేగంపేట విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస గౌడ్‌, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. కేటీఆర్‌ సూచన మేరకే వేములవాడకు హెలికాఫ్టర్‌ సదుపాయాన్ని కల్పించామన్నారు. రూ.100 కోట్లు పెట్టి వేములవాడలో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఒక్క టూరిజం ప్రాంతాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement