
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్స్‌లో సన్నబియ్యంతో విద్యార్థులకు మూడు పూటలా భోజనాలు పెడుతున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హరీశ్ ఆదివారం మిట్టపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఆరో జోనల్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిట్టపల్లిలో జోనల్ స్థాయి క్రీడలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 269 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలలు మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రవీణ్ లాంటి అధికారి ఉండటం చాలా అదృష్టమని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి రాష్ట్రానికి, తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన వెయ్యి మంది విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుతున్నారని హరీశ్ వెల్లడించారు.