బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం | Harish rao slips down while on mission kakaitya works | Sakshi
Sakshi News home page

బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం

Apr 29 2015 7:12 PM | Updated on Sep 3 2017 1:07 AM

బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం

బురదలో పడిన హరీష్‌రావు.. తప్పిన ప్రమాదం

మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రమాదవ శాత్తు బురదలో కూరుకుపోయారు.

నంగునూర్(మెదక్ జిల్లా): మిషన్ కాకతీయ పనులను పర్యవేక్షించేందుకు వెళ్లిన భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రమాదవ శాత్తు బురదలో కూరుకుపోయారు. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా నంగునూర్ మండలంలోని ఎర్రచెరువు వద్ద జరిగింది. వివరాలు.. మండలంలోని ఎర్రచెరువు పూడిక తీతకు రూ.55లక్షలను కేటాయించారు.

ఈ క్రమంలోనే పూడిక తీత పనులను పర్యవేక్షించేందుకు మంత్రి హరీష్‌రావు వెళ్లారు. ఆ సమయంలో మంత్రి ప్రమాదవశాత్తు ప్రొక్లేన్ పూడికతీస్తున్న మట్టిలో కూరుకుపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, డ్రైవర్‌ను హెచ్చరించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం సిబ్బంది మంత్రిని బురదలో నుంచి బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement