సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం | Grand welcome CM KCR Nalgonda district | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం

Dec 24 2014 2:40 AM | Updated on Aug 29 2018 4:16 PM

సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం - Sakshi

సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం

కృష్ణపట్టె ప్రాంతంలో పవర్ ప్లాం ట్‌ల నిర్మాణానికి గాను ఏరియల్ సర్వే నిర్వహించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు

 మిర్యాలగూడ : కృష్ణపట్టె ప్రాంతంలో పవర్ ప్లాం ట్‌ల నిర్మాణానికి గాను ఏరియల్ సర్వే నిర్వహించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో ఏర్పా టు చేసిన హెలీ పాడ్ వద్ద మంత్రులు లకా్ష్మరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌లతో కలిసి వచ్చిన సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. స్వాగతం పలికిన వారిలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు నోముల నర్సింహ్మ య్య, వేనేపల్లి చందర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, రాంచందర్‌నాయక్, గోలి అమరేందర్‌రెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, జెడ్‌పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీపీ మంగమ్మ తదితరులు ఉన్నారు.
 
 అధికారుల హడావిడి..
 ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వేలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని భావించిన అధికారులు హడావిడి చేశారు. మధ్యాహ్నం సీఎం భోజనం చేసిన అనంతరం జిల్లా అధికారులంతా సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. కేవలం అవసరమైన జిల్లా అధికారులతో మాత్రమే ముఖ్యమంత్రి మాట్లాడారు. పలు అంశాలపై చర్చించారు.

 

 

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement