కిర్గిస్తాన్‌లో వైద్య విద్యార్థుల వెతలు

Four Thousand Telugu Students Stuck In Kyrgyzstan Due To Lockdown - Sakshi

లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయిన 4వేల మంది

కాలేజీలు మూతపడి మూడునెలలైనా రాలేని పరిస్థితి

స్వదేశానికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో 4 వేల మంది తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయారు. కళాశాలలు మూతపడి మూడు నెలలైనా స్వ దేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిర్గిస్తాన్‌ రాజధాని బిష్‌కేక్‌లోని నాలుగు మెడికల్‌ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల విద్యార్థులు కరోనా ప్రభావంతో భ యం భయంగా అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగు విద్యార్థులు చనిపోవడం కూడా వారిని ఆందోళన కు గురిచేస్తోంది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా 500 మంది భారత పౌరులను ఇండియాకు తరలించి న ప్రభుత్వం.. ఈనెల 20న మరో విమానాన్ని కిర్గిస్తాన్‌కు నడుపుతోంది. సుమారు 14 వేల మం ది భారతీయులు స్వదేశానికి రావడానికి ఎదురుచూస్తుండటంతో విమాన టికెట్ల ధరలు కూడా రెట్టింపయ్యాయి. సాధారణ రోజుల్లో రాకపోకల కు రూ.28వేలు ఉండగా.. ప్రస్తుతం కేవలం ఇండియాకు  రావడానికే రూ.20 వేలు పలుకుతోంది.

పెరుగుతున్న కేసుల సంఖ్య
కిర్గిస్తాన్‌లోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. లా క్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేయడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పుంజుకుందని అక్కడే మెడిసిన్‌ చదువుతు న్న వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌కు చెందిన సంకేపల్లి హరికారెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని, సరైన ఆహా రం దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ‘సాక్షి’కి చెప్పారు. భారత్‌కు విమానాలు నడపాలని స్థానిక రాయబార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన లేదని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని చొరవ చూపాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top