వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి | four killed in road accidents in telangana districts | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

Sep 22 2014 8:46 AM | Updated on Aug 30 2018 3:58 PM

: తెలంగాణలోని రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం వద్ద ...

హైదరాబాద్ : తెలంగాణలోని రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

కాగా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం పెద్ద కల్వల వద్ద కారు ఢీకొని రాజమ్మ అనే మహిళ మృతి చెందింది. ఇక పెద్దపల్లి మండలం మూలాకాల గ్రామంలో కుటుంబ కలహాలతో వెంకటేశ్ అనే కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement