'చంద్రబాబు ప్రతిపాదనలో కుట్ర దాగుంది' | foul play behind chandrababu statement | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ప్రతిపాదనలో కుట్ర దాగుంది'

Aug 1 2014 3:19 PM | Updated on Sep 5 2018 9:00 PM

'చంద్రబాబు ప్రతిపాదనలో కుట్ర దాగుంది' - Sakshi

'చంద్రబాబు ప్రతిపాదనలో కుట్ర దాగుంది'

ఫీజు మాఫీలో 58 శాతం భరిస్తానన్న చంద్రబాబు ప్రతిపాదనలో కుట్ర దాగుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ఫీజు మాఫీలో 58 శాతం భరిస్తానన్న చంద్రబాబు ప్రతిపాదనలో కుట్ర దాగుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ 60 శాతానికి పైగా సీమాంధ్ర విద్యార్థులే ఉన్నారని అన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డిలలో చదువుతున్న విద్యార్థుల్లో 58 శాతం ఫీజులను చంద్రబాబు భరించాలని, అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాప్యం చేయకుండా ఫీజు మాఫీ అంశంపై చర్చలు జరపాలని సూచించారు. ఎంసెట్‌లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల మొత్తం ఫీజులో తమ ప్రభుత్వం 58 శాతం ఫీజును రీయింబర్స్ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement