పత్తి కొనుగోలు కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం | fire accident in cotton Buying Center | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోలు కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Feb 25 2015 6:17 PM | Updated on Sep 5 2018 9:45 PM

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ మండలంలోని కొండపల్లి రోడ్డు మార్గంలో ఉన్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

మహబూబ్‌నగర్ (గద్వాల్): మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ మండలంలోని కొండపల్లి రోడ్డు మార్గంలో ఉన్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. సుమారు రూ. 4 కోట్ల విలువ చేసే 4 వేల క్వింటాళ్ల పత్తి, 916 పత్తి బేళ్లు దగ్దం అయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా సంభవించిందనే విషయం తెలియరాలేదు. మంటలను ఆర్పేందుకు మూడు ఫైరింజన్లు శతవిధాలా శ్రమిస్తున్నాయి. మరో రెండు మూడు గంటల తర్వాతనే మంటలు అదుపులోకి రావచ్చని అధికారులు చెబుతున్నారు. గోదాంలో ఉన్న పత్తికి బీమా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement