కలిసిరావడం లేదని.. కూతురినే కడతేర్చిన తండ్రి! | Father killed his daughter | Sakshi
Sakshi News home page

కలిసిరావడం లేదని.. కూతురినే కడతేర్చిన తండ్రి!

Dec 20 2015 2:56 AM | Updated on Jul 30 2018 8:29 PM

కలిసిరావడం లేదని.. కూతురినే కడతేర్చిన తండ్రి! - Sakshi

కలిసిరావడం లేదని.. కూతురినే కడతేర్చిన తండ్రి!

కన్నతండ్రే కాలయముడయ్యాడు. చిన్నారిని గొంతునులిమి హతమార్చాడు. మెదక్ జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన

కాలితో తన్ని.. గొంతు నులిమి.. 13 నెలల చిన్నారిని చంపేసిన వైనం

 కోహీర్: కన్నతండ్రే కాలయముడయ్యాడు. చిన్నారిని గొంతునులిమి హతమార్చాడు. మెదక్ జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన దుర్గయ్య, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. మొదట ఇద్దరు ఆడపిల్లలు. తరువాత కొడుకు పుట్టాడు. మళ్లీ కొడుకు పుడతాడని భావించిన దుర్గయ్యకు నాలుగో సంతానంగా కూతురు జన్మించడంతో జీర్ణించుకోలేక పోయాడు.  చిన్న కూతురు సరోజ పుట్టిన తరువాత ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఆ పాపను ఎలాగైనా కడతేర్చాలని భావించి, సమయం కోసం ఎదురుచూడసాగాడు.

ఈ విషయాలేవీ తెలియని లక్ష్మి రోజూలాగే చిన్నారికి పాలిచ్చి బయటికి వెళ్లింది. అంతలోనే దుర్గయ్య వచ్చి ఆ చిన్నారిని చెంపలు వాయిం చాడు. కాలితో కసితీరా తన్నాడు. గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తల్లి తిరిగి వచ్చి చూసేసరికే కూతురు చనిపోయి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement