breaking news
durgaiah
-
మెదక్ ఇన్‌స్టా లవర్ బాయ్ గేమ్ ఓవర్
సోషల్ మీడియా పరిచయాలు కొన్నిసార్లు ఎంత ప్రమాదకరంగా మారతాయో తెలిపే ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీలతో ప్రేమ నాటకం ఆడిన ఓ కేటుగాడు, ఇద్దరు యువతులను మోసం చేసి మొత్తం రూ.12 లక్షలతో పాటు తులం బంగారం దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.పోలీసులు, బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి, ఏక్లాస్పూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు ఇన్స్టాగ్రామ్ ద్వారా “సాత్విక్ రెడ్డి”, “రిత్విక్ రెడ్డి” అనే పేర్లతో ఉన్న ఖాతాల ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకున్నారు. మాటలతో నమ్మకం సంపాదించిన ఆ వ్యక్తి, తనను తాను ప్రేమలో ఉన్నవాడిగా, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి కథలు అల్లుతూ దశలవారీగా వారి వద్ద నుంచి నగదు, బంగారం తీసుకున్నాడు. కొంతకాలానికి అనుమానం రావడంతో బాధితులు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అనంతరం ఇది పూర్తిగా మోసమని తేలడంతో టేక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఈ ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీల వెనుక ఉన్నది ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య అని గుర్తించారు. సోషల్ మీడియాలో హ్యాండ్సమ్ లుక్‌తో, వేరే పేర్లతో పరిచయాలు పెంచుకుని పలువురిని లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.సోషల్ మీడియా పరిచయాల్లో అజాగ్రత్తగా నమ్మకం పెట్టుకోవద్దని, వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
నాకు కడుపుమండి చెప్తున్నా... DSC లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాళ్ళను
-
తప్పుడు కేసు పెడుతున్నా..! క్షమించండి.. బాబు బండారం బట్టబయలు చేసిన సీఐ
-
Hindupur: చేతులెత్తి మొక్కుతా క్షమించు మద్యం వ్యాపారితో CI సంచలన ఆడియో
-
కాటేసిన కల్తీ కల్లు
అనంతగిరి: కల్తీ కల్లు తాగి ఒక వ్యక్తి మృతి చెందగా, మరో 29 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాలివి. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలోని ఒక దుకాణంలో 19వ తేదీ సోమవారం సాయంత్రం కల్లు తాగిన వారిలో.. ఎనిమిది మంది మంగళవారం వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధి తులను వారి కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించగా అర్ధరాత్రి తర్వాత దుర్గయ్య అనే వ్యక్తి మృతి చెందారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయాన్నే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. శిబిరానికి వచ్చిన మరో 22 మంది పరిస్థితి బాగా లేకపోవడంతో వికారాబాద్‌కు తరలించారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ప్రస్తుతం 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మిగిలిన వారు డిశ్చార్జి అయ్యారు. ఎంపీడీవో వినయ్‌కుమార్, ఎంపీవో దయానంద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవి, పీహెచ్సీ వైద్యుడు సుధాకర్‌రెడ్డి గ్రామంలో పర్యటించారు. బాధితుల ఇళ్లు, నీటి ట్యాంకులను పరిశీలించారు. నీరు కలుషితం కాలేదని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం కల్లు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కల్తీ లక్షణాల్లేవని ఆ శాఖ సీఐ రాగవీణ స్పష్టం చేశారు. -
15 ఏళ్ల నిరీక్షణకు తెర
కోనరావుపేట: దుబాయ్ వెళ్లిన ఓ వలసజీవి.. అక్కడి ఏజెంట్ మోసానికి 15 ఏళ్లు నరకయాతన అనుభవించాడు. వీసా లేకుండా పనిచేశాడంటూ దుబాయ్ ప్రభుత్వం రూ.5.15 లక్షల జరిమానా విధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ఎగ్లాస్పూర్కు చెందిన దొబ్బల దుర్గయ్య రూ.80 వేలు అప్పు చేసి ఓ ఏజెంట్ ద్వారా 2005 లో దుబాయ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్ పాస్‌పోర్ట్ తీసుకుని వదిలేశా డు. 15 ఏళ్లు నరకం అనుభవించాడు. విషయం తెలుసుకున్న ఇండియన్ పీపుల్స్ ఫోరం ఉపాధ్యక్షుడు జనగామ శ్రీనివాస్ అక్కడి అధికారులతో మాట్లాడి.. వీసా, టికెట్, అవుట్ పాస్‌పోర్ట్ ఇప్పించి ఇండియాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం దుర్గయ్య స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. -
స్వైన్ ఫ్లూతో వర్ధన్నపేట ఏసీపీ మృతి!
-
కలిసిరావడం లేదని.. కూతురినే కడతేర్చిన తండ్రి!
కాలితో తన్ని.. గొంతు నులిమి.. 13 నెలల చిన్నారిని చంపేసిన వైనం కోహీర్: కన్నతండ్రే కాలయముడయ్యాడు. చిన్నారిని గొంతునులిమి హతమార్చాడు. మెదక్ జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన దుర్గయ్య, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. మొదట ఇద్దరు ఆడపిల్లలు. తరువాత కొడుకు పుట్టాడు. మళ్లీ కొడుకు పుడతాడని భావించిన దుర్గయ్యకు నాలుగో సంతానంగా కూతురు జన్మించడంతో జీర్ణించుకోలేక పోయాడు. చిన్న కూతురు సరోజ పుట్టిన తరువాత ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఆ పాపను ఎలాగైనా కడతేర్చాలని భావించి, సమయం కోసం ఎదురుచూడసాగాడు. ఈ విషయాలేవీ తెలియని లక్ష్మి రోజూలాగే చిన్నారికి పాలిచ్చి బయటికి వెళ్లింది. అంతలోనే దుర్గయ్య వచ్చి ఆ చిన్నారిని చెంపలు వాయిం చాడు. కాలితో కసితీరా తన్నాడు. గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తల్లి తిరిగి వచ్చి చూసేసరికే కూతురు చనిపోయి ఉంది. -
రాముడు నా పాలి దేవుడు..
పొట్ట ఓ చేత పట్టుకుని.. మరో చేత రాముడ్ని పట్టుకుని దుర్గయ్య పట్నం వచ్చాడు. కుటుంబాన్ని సొంతూరు మెదక్‌లోనే వదిలేసి రాముడి పై భారం వేసి ఇక్కడొచ్చిపడ్డాడు. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు రాముడు రోజూ పెందరాలే ముస్తాబవుతాడు. దుర్గయ్య వెంట ఇంటింటికీ తిరుగుతాడు. అందరికీ దండాలు పెడతాడు. తన యజమానితో కలసి విన్యాసాలు చేస్తాడు. పంచెలతో తను సన్మానం పొంది.. దుర్గయ్యకు ఇన్ని పైసలు గిట్టుబాటు అయ్యేలా చూస్తాడు. అందుకే రాముడు నా పాలి దేవుడు అంటాడు దుర్గయ్య. తాతల నాటి నుంచి వచ్చిన వృత్తిని స్వీకరించిన దుర్గయ్య.. రాముడు తన పెద్దకొడుకని చెబుతాడు. రాముడు సంపాదనతోనే తన నలుగురు పిల్లలను చదివిస్తున్నానని చెబుతాడు. ‘రాముడు చెప్పిన మాట ఇంటడు. మా కడుపు నిండకపోయినా వీడ్ని మంచిగ జూస్కుంటం. పానం బాగోకపోయినా.. నా ఎంటొస్తడు. సంక్రాంతి అయిపోయినాంక మాకు అంత డిమాండ్ ఉండది. అయితే కొందరు వాళ్లింట్ల ఏ కార్యాలైనా పిలుస్తుంటరు. అట్ల ఏడాదంతా నడుస్తది. వారానికోపారి మెదక్ పోయి మా వోళ ్లకు పైసలిచ్చొస్తుంట. రాముడు ఉన్నంతకాలం బేఫికర్. ఆడు లేకపోతే ఎట్లనో’ అని చెమర్చిన కళ్లతో చెబుతాడు దుర్గయ్య. ..:: శిరీష చల్లపల్లి


