విద్యుత్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు | Farmers stage dharna for Power connections | Sakshi
Sakshi News home page

విద్యుత్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

Sep 4 2015 3:24 PM | Updated on Oct 1 2018 2:00 PM

కట్ చేసిన విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని త్రిపురారం మండలం రైతులు శుక్రవారం మండల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.

త్రిపురారం (నల్లగొండ) : కట్ చేసిన విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని త్రిపురారం మండలం రైతులు శుక్రవారం మండల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే..  బిల్లులు చెల్లించలేదని సత్యనారయణపురం, పనసాయి క్యాంప్, ఇండ్లకోటయ్యగూడెం, నారమ్మగూడకు చెందిన రైతుల విద్యుత్ కనెక్షన్లకు ఉన్న జంపర్లను తొలగించారు. ఎలాంటి హెచ్చరిక లేకండా విద్యుత్ కనెక్షన్లు తొలగించడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో ఆగ్రహం చెందిన రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement