కౌలు రైతు బలవన్మరణం | farmer suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు బలవన్మరణం

Mar 8 2015 12:15 AM | Updated on Oct 1 2018 2:44 PM

అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నార్కట్‌పల్లి (నల్లగొండ): అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పట్ల జంగిలయ్య(30), ఆరు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. దిగుబడి సరిగా రాకపోవటం, గిట్టు భాటు ధర లభించకపోవటంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. రూ.6 లక్షల వరకు అప్పు మిగిలిపోవటంతో మనస్తాపానికి గురైన జంగిలయ్య ఈనెల 4వ తేదీన క్రిమి సంహారక మందు తాగాడు. కామినేని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం సాయంత్రం చనిపోయాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement