పుష్కర పనులను సమీక్షించిన మంత్రి | Endowment Minister Indrakaran Reddy visits pushkara works in Adilabad | Sakshi
Sakshi News home page

పుష్కర పనులను సమీక్షించిన మంత్రి

Jun 4 2015 6:24 PM | Updated on Aug 17 2018 2:53 PM

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పుష్కర పనులను పర్యవేక్షించారు.

దండెంపల్లి (ఆదిలాబాద్ జిల్లా) :  తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం పుష్కర పనులను పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లా దండెంపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఆయన అధికారులతో మాట్లాడారు. పుష్కరాల పనులను జూన్ 15లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement