'డీఎస్ నిర్ణయం బాధాకరం' | DS party change decesion very sad says congress leaders | Sakshi
Sakshi News home page

'డీఎస్ నిర్ణయం బాధాకరం'

Jul 1 2015 7:36 PM | Updated on Mar 18 2019 9:02 PM

తమ నేత ధర్మపురి శ్రీనివాస్ పార్టీని వీడిపోవటం బాధాకరమని కాంగ్రెస్ నేతలు కె.సురేష్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు.

నిజామాబాద్: తమ నేత ధర్మపురి శ్రీనివాస్ పార్టీని వీడిపోవటం బాధాకరమని కాంగ్రెస్ నేతలు కె.సురేష్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. బుధవారం సాయంత్రం వారు నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. డీఎస్ తన నిర్ణయాన్ని మార్చుకుని, పార్టీలోనే కొనసాగాలని వారు కోరారు. పార్టీ హైకమాండ్‌పై ఆయన చేసిన విమర్శలు సరికావని వారు తెలిపారు. మెరుగైన అవకాశాల కోసం పార్టీని వీడి వెళ్లి పోతున్న ఆయన...విమర్శించటం పద్ధతి కాదని చెప్పారు. పార్టీ నాయకత్వం ఆయనకు అన్యాయం చేయలేదని చెప్పారు. అయితే, తామెవరమూ పార్టీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరటం లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం చేసేందుకు అందరం కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement