'తప్పు చేసినవారిని క్షమించవద్దు' | don't leave anybody | Sakshi
Sakshi News home page

'తప్పు చేసినవారిని క్షమించవద్దు'

Mar 10 2015 10:49 AM | Updated on Aug 11 2018 6:44 PM

తెలంగాణ అసెంబ్లీలో జాతీయ గీతం ఆలాపన సందర్భంగా జరిగిన సంఘటనపై హామీ మేరకు స్పీకర్ మధుసూదనాచారి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి కోరారు.

హైదరాబాద్ :  తెలంగాణ అసెంబ్లీలో జాతీయ గీతం ఆలాపన సందర్భంగా జరిగిన సంఘటనపై హామీ మేరకు స్పీకర్ మధుసూదనాచారి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి కోరారు. తప్పు చేసిన వారిని ఎవరిని క్షమించవద్దని ఆయన మంగళవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. గొడవకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

 

కాగా సభను వాయిదా వేసి సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించేవిధంగా స్పీకర్పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎమ్మల్యేలు డీకే అరుణ, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్ తదితరులు సభలోనే జానారెడ్డికి సూచించారు. అయితే వారి సూచనలను జానారెడ్డి ఏమాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం. కాగా  ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిన్న సభలో క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement