breaking news
janreddy
-
'తప్పు చేసినవారిని క్షమించవద్దు'
-
'తప్పు చేసినవారిని క్షమించవద్దు'
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో జాతీయ గీతం ఆలాపన సందర్భంగా జరిగిన సంఘటనపై హామీ మేరకు స్పీకర్ మధుసూదనాచారి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి కోరారు. తప్పు చేసిన వారిని ఎవరిని క్షమించవద్దని ఆయన మంగళవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. గొడవకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. కాగా సభను వాయిదా వేసి సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించేవిధంగా స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎమ్మల్యేలు డీకే అరుణ, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్ తదితరులు సభలోనే జానారెడ్డికి సూచించారు. అయితే వారి సూచనలను జానారెడ్డి ఏమాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం. కాగా ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిన్న సభలో క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.