కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ గల్లంతే | deposit missing to Congress, BJP says etela rajender | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ గల్లంతే

Sep 9 2014 11:50 PM | Updated on Mar 29 2019 9:24 PM

కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ గల్లంతే - Sakshi

కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ గల్లంతే

మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ గల్లంతు ఖాయమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

సిద్దిపేట రూరల్ : మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ గల్లంతు ఖాయమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం మం డలంలోని నారాయణరావుపేట గ్రామం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 43 అంశాలపై మేనిఫెస్టో అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు.

తెలంగాణకు వ్యతిరే కంగా ఉన్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేశారో ఇప్పుడు ఏం చేయడానికి ఓటు వేయమని అడుగుతున్నారో కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

 కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీహరిగౌడ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ బాలమణి రంగాగౌడ్, ఎంపీటీసీ మునిగెల కిష్టయ్య, నాయకులు కమలాకర్‌రావు, బాలకిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, నల్ల నరేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, బాల్‌రంగరం, రవీందర్‌రెడ్డి, మేర్గు మహేష్, రాజయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement