మానవత్వం వర్షార్పణం

Dead Body Was In The Rain On The Premises Of The MGM Hospital At Warangal - Sakshi

ఎంజీఎం ఆస్పత్రి ఆవరణలో వర్షంలోనే మృతదేహం

పట్టించుకోని మృతురాలి బంధువులు, సిబ్బంది

అంత్యక్రియల ఏర్పాట్లు చేసుకున్నాక తీసుకెళ్లిన వైనం

ఎంజీఎం: కరోనా పుణ్యమా అని మానవత్వం మంటగలుస్తోంది. ఆస్పత్రి ఆవరణలో ఓ మృతదేహం గంటల తరబడి వర్షంలో తడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోని అమానవీయ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. హన్మకొండకి చెందిన ఏనబోతుల స్వరాజ్యలక్ష్మి (68)ని ఆమె బంధువులైన ఇద్దరు మహిళలు సోమవారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతుండటంతో కోవిడ్‌ వార్డుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ పరీక్షిం చగా.. కోవిడ్‌ లక్షణాలు లేవని తేలడంతో క్యాజువాలిటీ విభాగానికి తరలించారు. చికి త్స పొందుతున్న క్రమంలో స్వరాజ్యలక్ష్మి పరిస్థితి విషమించి మృతి చెందింది.

మృతదేహాన్ని వైద్య సిబ్బంది క్యాజువాలిటీ ప్రాంగణం వరకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. కాగా, స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో స్వరాజ్యలక్ష్మి బం ధువులైన ఇద్దరు మహిళలు అక్కడి నుంచి దూరంగా వెళ్లి.. కుటుంబసభ్యులకు ఫోన్లు చేస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. ఆ సమయంలో మృతదేహం కాజ్యు వాలిటీ వద్దే ఆరు బయట ఉండగా వర్షం మొదలైంది. వెంట వచ్చిన వారు దగ్గర లేక, సిబ్బంది పట్టించుకోక రెండు గంటలపాటు మృతదేహం వర్షంలో తడిసిపోయింది. చివరకు అంత్యక్రియల ఏర్పాట్లు పూర్తయ్యాక మృతదేహాన్ని తీసుకెళ్లారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top