స్పృహలోకి వచ్చిన దర్శన్ | Darshan Goud health condition improves | Sakshi
Sakshi News home page

స్పృహలోకి వచ్చిన దర్శన్

Jul 25 2014 7:18 PM | Updated on Oct 16 2018 3:12 PM

స్పృహలోకి వచ్చిన దర్శన్ - Sakshi

స్పృహలోకి వచ్చిన దర్శన్

'మాసాయిపేట' దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు.

హైదరాబాద్: 'మాసాయిపేట' దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. 20 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఐదుగురు విద్యార్థులకు వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 40 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. 2,3 రోజుల్లో కొందరిని డిశ్చార్జ్ చేస్తామని యశోద వైద్యులు చెప్పారు.

విద్యార్థి దర్శన్‌ గౌడ్‌ స్పృహలోకి వచ్చాడని తెలిపారు. ఈరోజు దర్శన్ పుట్టినరోజు కావడంతో అతడితో కేక్ కట్ చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement