పేలిన గ్యాస్ సిలిండర్..తప్పిన ప్రమాదం | cylinder blast caused to two injured | Sakshi
Sakshi News home page

పేలిన గ్యాస్ సిలిండర్..తప్పిన ప్రమాదం

Jun 10 2015 9:58 PM | Updated on Aug 25 2018 5:39 PM

వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

మల్కాజిగిరి : వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సైదులు కథనం ప్రకారం..వసంతపురికాలనీకి చెందిన రావులపల్లి అంజయ్య(64) కార్పెంటర్ పనిచేస్తున్నాడు. భార్య చనిపోవడంతో మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. అయితే బుధవారం తల్లి మూడో వర్ధంతి ఉండటంతో అంబర్‌పేట్ నుంచి వచ్చిన కూతురు ఉష వంట చేయడానికి గ్యాస్ స్టౌ వెలిగించగానే రెగ్యులేటర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ సంఘటనతో ఆమెకు చేతికి, కాలికి, తండ్రి అంజయ్య ముఖానికి గాయాలయ్యాయి. వారు వెంటనే బయటకు పరిగెత్తుకు వచ్చారు.

ఆ వెంటనే ఒక్కసారిగా సిలిండర్ పేలి ఇంట్లో మంటలు చెలరేగి ఇంట్లో సామాన్లు కాలిబూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో తండ్రి, కూతురు చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితమే సిలిండర్ తీసుకున్నామని గ్యాస్ లీకేజీని గమనించలేక పోయామని అంజయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement