మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి | cyclist died in a road accident | Sakshi
Sakshi News home page

మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి

Mar 12 2015 5:59 PM | Updated on Aug 30 2018 3:56 PM

నల్లగొండ జిల్లా నడిగూడెం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

నల్లగొండ : నల్లగొండ జిల్లా నడిగూడెం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ..  సైకిల్‌పై ఎదురుగా వస్తున్న సిరిపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ(65)ను ఢీకొన్నాడు.

ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సత్యనారాయణ మృతి చెందాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో సాయిని ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement