పెరిగిన ధరలపై వామపక్షాల ధర్నా | cpi, cpm dharna against petrol prices | Sakshi
Sakshi News home page

పెరిగిన ధరలపై వామపక్షాల ధర్నా

May 16 2015 12:31 PM | Updated on Aug 13 2018 8:10 PM

పెరిగిన ధరలపై వామపక్షాల ధర్నా - Sakshi

పెరిగిన ధరలపై వామపక్షాల ధర్నా

దేశ వ్యాప్తంగా తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగాయి.

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగాయి. శనివారం రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సీపీఐ, సీపీఎమ్ పార్టీలు తమ నిరసన గళాన్ని వినిపించాయి. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ప్రధాని నరేంద్రమోదీ దిష్టి బొమ్మను సీపీఐ నాయకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డితో సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

పెట్రోలుపై లీటరుకు రూ. 3.13, డీజిల్పై లీటరుకు రూ. 2.71 చొప్పున పెరిగిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement