స్మార్ట్‌ పరిశుభ్రతా ప్రధానమే | COVID 19 Smartphone Cleaning Important When use | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ పరిశుభ్రతా ప్రధానమే

Mar 20 2020 8:24 AM | Updated on Mar 20 2020 8:24 AM

COVID 19 Smartphone Cleaning Important When use - Sakshi

కుత్బుల్లాపూర్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలలో మొదటగా వినిపించేది పరిశుభ్రత. హ్యాండ్‌ శానిటైజర్‌ లేదా యాంటీసెప్టిక్‌ సబ్బుతో చేతులను తరచూ 15 సెకన్ల పాటు శుభ్రం చేసుకోవాలనే మాట ఇప్పుడు అంతట వినిపిస్తున్నదే.  చేతులను మాత్రమే కాదు మనం నిత్యం చేతిలో వెంట ఉంచుకునే స్మార్ట్‌ ఫోన్‌ని కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు మైక్రోబయాలజిస్ట్‌లు. నిత్యం వాడే స్మార్ట్‌ ఫోన్‌లపై టాయిలెట్‌ కంబోర్డు కవర్‌పై ఉండే బ్యాక్టీరియా కన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఓ పక్క కరోనా వైరస్‌ వేధిస్తున్న క్రమంలో చేతుల పరిశుభ్రతతో పాటు స్మార్ట్‌ ఫోన్‌ పరిశుభ్రత కూడా ముఖ్యమే. ఈ క్రమంలో స్మార్ట్‌ ఫోన్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి? దేన్ని ఉపయోగించి క్లీన్‌ చేసుకోవాలనే తదితర అంశాలు మీ కోసం..  

అల్కహాల్‌ వైప్స్‌: మార్కెట్‌లో రెడీమేడ్‌గా దొరికే ఒక్కో ఆల్కహాల్‌ వైప్‌ రూ. 3 నుంచి బ్రాండ్‌ను బట్టి రూ.10కి దొరుకుతుంది. దీంతో సులభంగా స్మార్ట్‌ ఫోన్‌ను శుభ్రం చేసుకోవచ్చు. దీని వలన మన స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌కు ఎటువంటి నష్టం ఉండదు. 

మైక్రో ఫైబర్‌ క్లాత్‌తో: కెమికల్‌ ఫ్రీ సోప్‌ మిక్స్‌ లేదా వాటర్‌లో కొంచెం అదనంగా గోరువెచ్చని నీళ్లు కలపాలి. ఇందులో మైక్రో ఫైబర్‌ క్లాత్‌ లేదా సాప్ట్‌ క్లాత్‌ను ముంచిఅదనంగా పీల్చుకున్న వాటర్‌ను స్క్విజ్‌ చేయాలి. ఇప్పుడు ఈ క్లాత్‌లో నెమ్మదిగా ఫాన్‌ స్క్రీన్‌ తో పాటుగా అన్ని వైపులా శుభ్రం చేసుకోవాలి.

స్క్రీన్‌ డస్టర్‌: స్మూత్‌ డస్టర్‌లో ఇన్‌బిల్ట్‌గా క్లినింగ్‌ లిక్విడ్‌ ఉండే స్మార్ట్‌ స్ప్రేయర్‌ ద్వారా ఫోన్‌ను శుభ్రం చేసుకోవచ్చు. గ్యాడ్జెట్స్‌ షోరూంలలో, కంప్యూటర్‌ దుకాణాలలో ఇది లభిస్తుంది. రూ. 300 ఉండే ఈ యూనివర్సల్‌ స్క్రీన్‌ క్లీనర్‌ ఆన్‌లైన్‌లలో కూడా లభిస్తుంది. స్టెరిలైజ్డ్‌ యూవీ లైట్‌ కంటైనర్‌లో కూడా ఫోన్‌ ఉంచి శుభ్రం చేసుకోవచ్చు. కానీ ఇది చాలా ఖరీదు. 

స్మార్ట్‌ ఫోన్‌ హోల్స్‌ ఇలా: ఫోన్‌కు ఉన్న చార్జింగ్, ఇయర్‌ఫోన్, స్పీకర్‌ రంధ్రాలను బడ్స్‌తో శుభ్రపరచుకొవాలి. బడ్స్‌ను సోప్‌ వాటర్‌లో ముంచి లైట్‌వెట్‌గా ఉన్నప్పుడు బడ్స్‌ను హోల్స్‌లో తిప్పుతూ క్లీన్‌ చేసుకోవాలి. 

గమనిక: ఫోన్‌ను శుభ్రం చేస్తున్న సందర్బంలో స్విచ్‌ ఆఫ్‌ ఉంచుకోవాలి. స్క్రీన్‌ను చాలా జెంట్లీగా తుడవాలి. వాటర్‌ రిసిస్టెంట్‌ ఫోన్‌లు, ఐపీ68, 35 ప్రమాణాలు  కలిగి ఫోన్‌లను సైతం ఇలాగే శుభ్రం చేయాలి తప్ప పూర్తిగా నీటిలో ముంచి క్లీన్‌ చేయకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement