రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి | couple dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Feb 27 2015 7:27 AM | Updated on Jul 10 2019 7:55 PM

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులు మృతి చెందారు.

బాలానగర్: మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులు మృతి చెందారు. మృతులను గోపాల్, శ్యామలగా గుర్తించారు. వీరు మరో ఇద్దరితో కలసి కారులో హైదరాబాద్ వైపు  వస్తుండగా 44వ నంబర్ జాతీయ రహదారిపై బాలానగర్ సమీపంలోని పెద్దాయపల్లి వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపాల్, శ్యామల అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement