సంజీవరెడ్డిపై కాంగ్రెస్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత  | Congress suspension Lifting on Sanjeeva Reddy | Sakshi
Sakshi News home page

సంజీవరెడ్డిపై కాంగ్రెస్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత 

Apr 3 2019 4:40 AM | Updated on Apr 3 2019 4:40 AM

Congress suspension Lifting on Sanjeeva Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ దివంగత ఎమ్మెల్యే పి.కృష్ణారెడ్డి తనయుడు సంజీవరెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ సస్పెన్షన్‌ ఎత్తివేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరించడంతో బీజేపీ నుంచి ఆయన నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు. అయితే పార్టీ ఆదేశాలను ధిక్కరించడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలక సమయంలో మళ్లీ సొంతగూటికి వచ్చేందుకు సంజీవరెడ్డి సిద్ధం కావడంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే ఆయన అధికారికంగా మళ్లీ పార్టీలో చేరుతారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. 

Advertisement
 
Advertisement
Advertisement