కాంగ్రెస్‌ నుంచి నలుగురు రెబల్స్‌  | Congress Rebels Contest In Election Khammam | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నుంచి నలుగురు రెబల్స్‌ 

Nov 23 2018 4:08 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Rebels Contest In Election Khammam - Sakshi

గుడిలో ప్రమాణం చేస్తున్న కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు  

సాక్షి,ఇల్లెందు: ఇల్లెందులో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. అదే తరహాలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపసంహరణ గడువు ముగిసేనాటికి ఒక్కొక్కరు జారుకున్నారు. గురువారం ఉదయం పట్టణంలోని ఒక దేవాలయ ఆవరణలో సమావేశమైన కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు ఏక వాక్య తీర్మానంతో దేవుడి మీద ప్రమాణం చేశారు. ఊకె అబ్బయ్యకు ఆదివాసీ వర్గం నుంచి, బాలాజీరావునాయక్‌ బంజారా వర్గం నుంచి మద్దతు తెలిపేలా నిర్ణయించారు.  అనంతరం అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ  చీమల వెంకటేశ్వర్లు, భూక్యా దళ్‌సింగ్‌ నాయక్, గుగులోతు కిషన్‌నాయక్, అంగోతు శివ, రాంజీ, నామోదర్‌ నాయక్‌ పోటీ నుంచి విరమించుకున్నారు. ఊకె అబ్బయ్య, మాలోతు మున్నా నాయక్, గుగులోతు రవి, బాలాజీరావులు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ రెబల్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన  దేవీలాల్‌నాయక్‌.. హైకమాండ్‌ ఆదేశాలతో బరిలో నుంచి తప్పుకున్నారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement