రేపు బెంగళూరుకు కేసీఆర్‌ | cm kcr meets former prime minister deve gowda tomorrow | Sakshi
Sakshi News home page

రేపు బెంగళూరుకు కేసీఆర్‌

Apr 12 2018 5:58 PM | Updated on Aug 15 2018 9:06 PM

cm kcr meets former prime minister deve gowda tomorrow - Sakshi

కేసీఆర్‌ తాజాగా మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: జాతీయస్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ కానున్నారు. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి కేసీఆర్‌ ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు. ప్రస్తుత రాజకీయాలపై దేవెగౌడతో చర్చించిన అనంతరం రేపు సాయంత్రం సీఎం హైదరాబాద్‌ చేరుకుంటారు.

రాజకీయ వేదిక ఏర్పాటు ప్రక్రియ దిశగా ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. అనంతరం జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్‌ సోరేన్‌ హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌, దేవెగౌడల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement