వినాయక మండపం వద్ద ఘర్షణ | clashes between two groups at vinayak mandapam in hyderabad | Sakshi
Sakshi News home page

వినాయక మండపం వద్ద ఘర్షణ

Sep 27 2015 4:07 PM | Updated on Sep 3 2017 10:05 AM

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది.

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. బోజగుట్టలోని వివేకానందనగర్ లో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం వద్ద శనివారం రాత్రి అన్నదాన కార్యక్రమం జరిగింది. అర్ధరాత్రి దాటాక ఈ ప్రాంతంలోని ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి.

రెండు వర్గాలకు చెందిన వారు ఆసిఫ్‌నగర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనక శుక్రవారం సాయంత్రం మండపం ముందు నుంచి వెళ్తున్న ఇద్దరు యువతులను దూషించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement