వైరల్‌ వీడియో: గురుద్వారాలో తుపాకీ కాల్పులు.. పెప్పర్ స్ప్రే.. | Gun And Pepper Spray: Clashes Inside Germany Gurdwara | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: గురుద్వారాలో తుపాకీ కాల్పులు.. పెప్పర్ స్ప్రే..

Apr 21 2026 9:02 AM | Updated on Apr 21 2026 9:14 AM

Gun And Pepper Spray: Clashes Inside Germany Gurdwara

బెర్లిన్: జర్మనీలోని మోయర్స్ (Moers) నగరంలోని డ్యూయిస్‌బర్గ్ ప్రాంతంలోని ఓ గురుద్వారాలో చోటుచేసుకున్న ఘర్షణలో 11 మంది గాయపడ్డారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. సుమారు 40 మంది ఈ ఘర్షణలో పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జర్మనీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కత్తులు, పెప్పర్ స్ప్రేతో పాటు తుపాకీని కూడా వాడినట్లు సమాచారం.

ప్రాథమిక సమాచారంలో ప్రకారం గురుద్వారా కొత్త పాలక మండలి ఎన్నికల విషయంలో తలెత్తిన విభేదాలే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గురుద్వారా నిధుల నిర్వహణ, ఆ నిధులపై పట్టు సాధించేందుకు వివిధ వర్గాల మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

 ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. "ఇది ముందే ప్లాన్ చేసినట్లు ఉంది. ప్రార్థనలు మొదలవ్వడానికి కొద్దిసేపటి ముందే, దాడి చేసిన వారు అకస్మాత్తుగా పెప్పర్ స్ప్రే కొట్టారు. ఆ తర్వాత ఒకరు పిస్టల్‌తో కాల్పులు జరిపారు. తాను అక్కడ కత్తులను కూడా చూశానని ఆయన తెలిపారు. ఈ ఘర్షణలో మొత్తం 11 మంది గాయపడగా.. పారా మెడికల్ సిబ్బంది వారికి అక్కడే చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ ఎవరి ప్రాణానికీ ప్రమాదం లేదు. పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఖాళీ బుల్లెట్ షెల్స్ లభించాయి. అవి 'బ్లాంక్-ఫైరింగ్ పిస్టల్' (శబ్దం మాత్రమే వచ్చే తుపాకీ) కి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. ఆ తుపాకీ ఇంకా లభించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement