ఈ పాపం ఎవరిది ? | Child dead body found in bridge, nalgonda district | Sakshi
Sakshi News home page

ఈ పాపం ఎవరిది ?

Feb 3 2015 12:56 PM | Updated on Sep 2 2017 8:44 PM

నల్గొండ జిల్లా చిలుకూరు మండలం కొత్త కొండాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

నల్గొండ: నల్గొండ జిల్లా చిలుకూరు మండలం కొత్త కొండాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని పసికందు మృతదేహన్ని స్థానిక గ్రామ వంతెన వద్ద ఆగంతకులు వదిలి వెళ్లారు. మంగళవారం ఉదయం శిశువు మృతదేహన్ని గుర్తించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు శిశువు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే శిశువు మృతదేహం గుర్తు పట్టేందుకు వీలు లేకుండా ఉండటంతో శిశువు ఎవరనేది తెలియరాలేదు. మృతదేహం పూర్తిగా దెబ్బతినడంతో రెండు రోజుల కిందటే... శిశువు మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement