తండ్రి అంత్యక్రియలకు వెళ్తుంటే.. ప్రమాదం | chevella rdo meets with road accident while going to father funerals | Sakshi
Sakshi News home page

తండ్రి అంత్యక్రియలకు వెళ్తుంటే.. ప్రమాదం

Jul 8 2014 8:18 AM | Updated on Aug 30 2018 3:58 PM

తండ్రి అంత్యక్రియల కోసం వెళ్తున్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్డీవో రవీంద్రనాథ్.. ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్డీవో ఎం.రవీంద్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులు వెళ్తున్న కారును ఓ లారీ ఢీకొనడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చేవెళ్ల ఆర్డీవో రవీంద్రనాథ్ తండ్రి మరణించారు. ఆయన అంత్యక్రియల కోసం రవీంద్రనాథ్, ఆయన సోదరుడు వెంకటరమణ, ఆయన భార్య జ్యోతి, పిల్లలు లక్ష్మి, సాత్విక్ కలిసి కారులో భద్రాచలానికి బయల్దేరారు.

అయితే కారు కొమ్ముగూడెం సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఓ లారీ వీరి కారును ఢీకొంది. దాంతో కారు డ్రైవర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి రెండు కాళ్లు విరిగిపోయాయి. శరీరం కూడా కారుకు, లారీకి మధ్య ఇరుక్కు పోయింది. రెండు గంటల పాటు ప్రయత్నించినా రాకపోవడంతో.. ట్రాక్లర్లతో కారును బయటకు లాగి అప్పుడు సురేష్ను బయటకు తీయాల్సి వచ్చింది. ఆర్డీవో రవీంద్రనాథ్కు ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి వచ్చిన 108 అంబులెన్సులో క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement