చీర్యాలలో చైన్ స్నాచింగ్ | chain snatching in cheryala | Sakshi
Sakshi News home page

చీర్యాలలో చైన్ స్నాచింగ్

Jul 14 2016 4:31 PM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో చైన్‌స్నాచర్లు గురువారం రెచ్చిపోయారు.

కీసర : రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో చైన్‌స్నాచర్లు గురువారం రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన లక్ష్మి(70) గురువారం మధ్యాహ్నం తన ఇంటి ముందు కూర్చుని ఉంది. ఇంతలో బైక్‌పై ఇద్దరు ఆగంతకులు ఆమె వద్దకు వచ్చి ఆగారు. ఏదో అడగబోతున్నట్లు నటించి..ఆమె మెడలోని ఐదు తులాల పుస్తెల తాడును తెంపుకుని క్షణాల్లో మాయమయ్యారు. దీనిపై బాధితురాలి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. సీఐ గురవారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement