'ఎల్లుండికల్లా తెలంగాణ విద్యార్థుల ర్యాంకులు' | cbse will declare telangana students jee ranks on day after tomarrow says kadiyam | Sakshi
Sakshi News home page

'ఎల్లుండికల్లా తెలంగాణ విద్యార్థుల ర్యాంకులు'

Jul 2 2015 8:15 PM | Updated on Oct 30 2018 7:30 PM

'ఎల్లుండికల్లా తెలంగాణ విద్యార్థుల ర్యాంకులు' - Sakshi

'ఎల్లుండికల్లా తెలంగాణ విద్యార్థుల ర్యాంకులు'

ఇంటర్ బోర్డు తప్పిదంతో జేఈఈ మెయిన్స్లో ర్యాంకులు రాని తెలంగాణ విద్యార్థుకు ఊరట లభించింది.

హైదరాబాద్: ఇంటర్ బోర్డు తప్పిదంతో జేఈఈ మెయిన్స్లో ర్యాంకులు రాని తెలంగాణ విద్యార్థుకు ఊరట లభించింది. ఎల్లుండి కల్లా ర్యాంకులు ప్రకటిస్తామని సీబీఎస్ఈ హామీ ఇచ్చినట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే జేఈఈ మెయిన్స్లో కొందరు విద్యార్థులకు ర్యాంకులు రాలేదని అన్నారు.1188 మంది విద్యార్థుల వివరాలు సీబీఎస్ఈకి వెళ్లకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందన్నారు. మెరిట్ జాబితాను సీబీఎస్ఈకి ఇంటర్ బోర్డు పంపకపోవడం వల్లే ఇలా జరిగిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఈ వ్యవహారంలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం పై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement