పేద అమ్మపై కేసు.. | Case on poor mother | Sakshi
Sakshi News home page

పేద అమ్మపై కేసు..

Apr 10 2017 2:13 AM | Updated on Aug 21 2018 5:51 PM

పేద అమ్మపై కేసు.. - Sakshi

పేద అమ్మపై కేసు..

భర్తకు వైద్యం చేయించేందుకు కన్నకొడుకును అమ్మిన పేద తల్లితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

భర్త వైద్యం కోసం బిడ్డను అమ్మినందుకు..

ఓదెల(పెద్దపల్లి): భర్తకు వైద్యం చేయించేందుకు కన్నకొడుకును అమ్మిన పేద తల్లితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లె తండాకు చెందిన గుగులోతు కవిత కన్నబిడ్డను రూ. లక్షకు అమ్మేయడం.. ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుడు రాజకుమారస్వామి నుంచి పొత్కపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు.

దీంతో బిడ్డ తల్లిదండ్రులు కవిత, తేజతో పాటు నానమ్మ తార, బిడ్డను కొనుగోలు చేసిన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన ఇందారపు నర్సయ్య, సుజాత దంపతులు, మధ్యవర్తిత్వం వహించిన నాంసానిపల్లికి చెందిన గుగులోతు లింగేశ్, శ్రీనివాస్, కందుల సందయ్యపై ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్సై పర్శ రమేశ్‌ తెలిపారు. గుగులోతు కవిత–తేజ దంపతుల ఆర్థిక పరిస్థితి బాగోలేక బాబును సంతానం లేని నర్సయ్య–సుజాత దంపతులకు విక్రయించి దత్తత ఇచ్చినట్టు కాగితం రాసుకున్నారని ఎస్సై వివరించారు. బాబును తల్లి కవితకు అప్పగించామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement