ఎర్రబెల్లి, రావులపై కేసు నమోదుకు ఆదేశం | Case filed agaist TDP leaders errabelli dayakara rao, ravula chandrashekar rao for insulting Telangana state symbols | Sakshi
Sakshi News home page

ఎర్రబెల్లి, రావులపై కేసు నమోదుకు ఆదేశం

Dec 11 2014 9:57 AM | Updated on Jul 11 2019 7:38 PM

ఎర్రబెల్లి, రావులపై కేసు నమోదుకు ఆదేశం - Sakshi

ఎర్రబెల్లి, రావులపై కేసు నమోదుకు ఆదేశం

తెలంగాణ సీఎం కేసీఆర్ను, రాష్ట్ర పక్షి, వృక్షం, జంతువులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డిలపై...

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ను, రాష్ట్ర పక్షి, వృక్షం, జంతువులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలన్న ప్రైవేటు ఫిర్యాదును నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది.  ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, నివేదికను జనవరి 12లోగా సమర్పించాలని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం పోలీసులను ఆదేశించారు.

కేసీఆర్ పిచ్చివాడని, ఆయన మాటలు ఎవరూ నమ్మడం లేదని...రాష్ట్ర పక్షి, జంతువులను అవమానపర్చేలా వీరిద్దరు ఈ నెల 6న సమావేశంలో వ్యాఖ్యలు చేశారని న్యాయవాది కొంతం గోవర్ధన్ రెడ్డి ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 295 (ఎ), 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. దీనిపై కోర్టు పైవిధంగా స్పందించింది.

Advertisement
 
Advertisement
Advertisement