ఆర్టీసీ సమ్మె : ప్రయాణికుడి కాలుపైకి ఎక్కిన బస్సు | Bus Accident At Nalgonda | Sakshi
Sakshi News home page

ప్రయాణికుడి కాలుపైకి ఎక్కిన బస్సు.. తీవ్రగాయాలు

Oct 14 2019 12:17 PM | Updated on Oct 14 2019 7:13 PM

Bus Accident At Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విధులకు హాజరు కాకపోవడంతో తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్నా.. అనుభవరాహిత్యం వల్ల పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బస్సు ఎక్కితే ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో రెండు బస్సులు ఢీకొన్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా నల్లగొండ జిల్లాలో ఓ అద్దె బస్సు డ్రైవర్‌ నిర్వాకం.. ఓ ప్రమాదానికి కారణమయింది. 

(చదవండి : రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. డ్రైవర్‌పై దాడి)

నల్లగొండ జిల్లా హాలియా బస్టాండ్‌లో ప్రయాణికుడి కాలుపైకి బస్సును ఎక్కించాడు ఓ డ్రైవర్‌. అనుముల మండలానికి చెందిన చంద్రకాంత్‌.. అద్దె బస్సు ఎక్కి హాలియా బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్సు దిగుతుండగానే డ్రైవర్‌ ముందుకు పోనించాడు. దీంతో బస్సు వెనుక చక్రాలు అతని కాలుపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి అతన్ని స్థానిక ఆస్పత్రి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement