రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి | brother's died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

Jul 22 2014 11:43 PM | Updated on Aug 30 2018 3:58 PM

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

రంజాన్ పండుగను పురస్కరించుకుని నూతన వస్త్రా లు కొనుగోలు చేసేందుకు వెళుతున్న అన్నదమ్ములను మృత్యువు లారీ రూ పంలో కబలించింది.

రామచంద్రాపురం: రంజాన్ పండుగను పురస్కరించుకుని నూతన వస్త్రా లు కొనుగోలు చేసేందుకు వెళుతున్న అన్నదమ్ములను మృత్యువు లారీ రూ పంలో కబలించింది. ఈ సంఘటన పట్టణంలోని సంగీత థియేటర్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీం దర్‌రెడ్డి కథనం మేరకు.. పట్టణంలోని మార్కెట్‌లో నివాసముండే ఇస్మాయిల్ మటన్ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇస్మాయిల్‌కు ముగ్గురు కుమారులు.
 
 రంజాన్‌ను పండుగను పురస్కరించుకుని బట్టలు తెచ్చుకునేందుకు పెద్ద కుమారుడు ఇమ్రాన్ (28), రెండో కుమారుడు సద్దాం (24) బైక్‌పై హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం రామచంద్రాపురం పట్టణంలోని సంగీత థియేటర్ సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న లారీ వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇమ్రాన్ అక్కడిక్కడే దుర్మరణం చెందగా, సద్దాం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రంజాన్ దగ్గర పడడంతో ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు అక్కడివారిని కలిచివేసింది. మృతుడి కుటుంబ సభ్యుల మేరకు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement