పిడుగుపాటుకు బాలుడు మృతి | Boy dies due to Thunderstorm | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు బాలుడు మృతి

May 2 2016 6:24 PM | Updated on Jul 12 2019 3:02 PM

పిడుగుపాటుకు బాలుడు మృతి - Sakshi

పిడుగుపాటుకు బాలుడు మృతి

చేవెళ్ల మండలం పామెన గ్రామంలో పిడుగుపాటుకు ఒక బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన వడ్డే అంతయ్య, అంజమ్మల కుమారుడు నవీన్(15) సోమవారం సాయంత్రం తల్లిదండ్రులతో కలసి పొలానికి వెళ్లాడు.

చేవెళ్ల (రంగారెడ్డి) : చేవెళ్ల మండలం పామెన గ్రామంలో పిడుగుపాటుకు ఒక బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన వడ్డే అంతయ్య, అంజమ్మల కుమారుడు నవీన్(15) సోమవారం సాయంత్రం తల్లిదండ్రులతో కలసి పొలానికి వెళ్లాడు. కొద్దిసేపటికి ఉరుములు, మెరుపులతో వాన మొదలైంది. అంతలోనే చేలో ఉన్న బాలుడిపై పిడుగుపడింది. కొద్దిదూరంలోనే ఉన్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకునే సరికే అతను మరణించాడు. దీంతో వారి రోదనకు అంతేలేకుండా పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement