క్వారిలో బాంబు పేలి డ్రిల్లర్ మృతి | bomb blasting in quarry driller died | Sakshi
Sakshi News home page

క్వారిలో బాంబు పేలి డ్రిల్లర్ మృతి

Apr 29 2015 12:04 AM | Updated on Sep 3 2017 1:02 AM

పొట్ట కూటికోసం కుటుంబంతో వచ్చిన ఒక కూలీ క్వారీలో బాంబుపేలి దుర్మరణం పాలయ్యాడు.

నెల్లికుదురు(వరంగల్ జిల్లా): పొట్ట కూటికోసం కుటుంబంతో వచ్చిన ఒక కూలీ క్వారీలో బాంబుపేలి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామ శివారు వీఎస్‌వీ గ్రానెట్ క్వారిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు..నల్లగొండ జిల్లా మోతె మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బొంత రవి(28) కుటుంబ పోషణ నిమిత్తం మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామ శివారులోని వీఎస్‌వీ గ్రానెట్ క్వారిలో తన కాంప్రెషర్ ట్రాక్టర్‌తో ఇదే గ్రామ శివారు బడితండాకు చెందిన గుగులోతు లక్ష్మణ్‌తో కలిసి పనిచేస్తున్నాడు.

 

రోజులాగే గ్రానెట్ క్వారిలో బండరాయికి కాంప్రెషర్‌తో హోల్ వేస్తుండగా అంతకు ముందే బండలో కూరుకుపోయిన ఉన్న బాంబు ఒక్కసారిగా పేలింది. జాకి నడిపిస్తున్న బొంత రవి అక్కడికక్కడే మృతి చెందగా, గుగులోతు లక్ష్మణ్‌కు తీవ్రగాయాలయ్యూరుు. అతడిని చికిత్సనిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రేణుక, కొడుకులు గోపి, తిరుపతిరావు, కూతురు అంజలి ఉన్నారు. సంఘటన స్థలానికి తొర్రూర్ సీఐ శ్రీధర్‌రావు, ఎస్సై బందం ఉపేందర్‌రావు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement