ఆడపిల్లల తండ్రిగా బాధతో చెబుతున్నా: పొంగులేటి

BJP Leader Ponguleti Sudhakar Reddy React On Priyanka Reddy Murder - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా బాధతో ఈ విషయాన్ని చెబుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక పాశవిక మృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. భవిష్యత్తులో మరెవ్వరూ కూడా ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడేందుకు భయపడేలా కఠినమైన చట్టాలను రూపొందించాలన్నారు. పౌరహక్కుల సంఘాలు ఈ విషయంలో సహకరించాలని, తాను కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నానని సుధాకర్‌రెడ్డి వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top