తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు | bjp is not concentrating on telangana, says guvvala | Sakshi
Sakshi News home page

తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

Feb 7 2015 7:19 PM | Updated on Mar 29 2019 9:31 PM

తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు - Sakshi

తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు తదితర విషయాల్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోందంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు.

మహబూబ్‌నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు తదితర విషయాల్లో తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోందంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. అదే సమయంలో పక్క రాష్ట్రం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో శనివారం సాయంత్రం జరిగిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ పార్టీ కృష్టి చేస్తోందని చెప్పారు. ఇతర పార్టీలు ఏజెంట్లను పెట్టుకుని దొంగ సభ్యత్వాలు నమోదు చేసుకున్నాయని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, సభ్యత్వాల నమోదు కార్యక్రమం జిల్లా ఇన్‌చార్జ్ మార్కండేయతో పాటు వెయ్యి మంది వరకు కార్యకర్తలు పాల్గొన్నారు.

(అచ్చంపేట)

Advertisement
 
Advertisement
Advertisement