టీజేఎస్‌తో చర్చలు జరుగుతున్నాయ్‌: కిషన్‌ రెడ్డి | BJP Core Committee Meeting Concluded | Sakshi
Sakshi News home page

ముగిసిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం

Sep 28 2018 10:28 PM | Updated on Sep 28 2018 10:28 PM

BJP Core Committee Meeting Concluded - Sakshi

తెలంగాణ జన సమితితో పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదని, చర్చలు జరుగుతున్నాయని..

హైదరాబాద్‌: నగరంలోని మారియట్‌ హోటల్లో బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్నికల వ్యూహం, ప్రచారంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అక్టోబర్‌ 1 నుంచి 15 లోపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని బీజేపీ అగ్రనేత కిషన్‌ రెడ్డి తెలిపారు. అమిత్‌ షా టూరు అక్టోబర్‌ 17న లేదా 18 తేదీలలో ఉండవచ్చునని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎటువంటి పెద్ద తలకాయలు బీజేపీలో చేరడం లేదని వెల్లడించారు. తెలంగాణ జన సమితితో పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదని, చర్చలు జరుగుతున్నాయని మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement