ఎక్స్‌ప్రెస్‌లొస్తే ఒట్టు.. | bikkanur village people face problem with rtc | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌లొస్తే ఒట్టు..

Jan 31 2018 4:02 PM | Updated on Jan 31 2018 4:02 PM

bikkanur village people face problem with rtc - Sakshi

భిక్కనూరుకు రాకుండా బైపాస్‌ మీదుగా వెళ్లిపోతున్న ఆర్టీసీబస్సు

భిక్కనూరు : ఆ ఊరికి బస్సుల్లేవని పిల్లనివ్వడం లేదు..నిజమే వింతగా అనిపించినప్పటికీ భిక్కనూరు మండలానికి ఇలాంటి చిక్కొకటి వచ్చిపడింది. మండల వ్యవస్థ ఏర్పడినప్పుడు భిక్కనూరు రాష్ట్రంలోనే ఆదర్శమండలంగా పేరొందింది. నాలుగులైన్ల రోడ్డు ఏర్పాటు కానప్పుడు ప్రతి ఆర్టీసీ బస్సు భిక్కనూరు మీదుగా వెళ్లేది. ఏ రాత్రయినా భిక్కనూరు రావాలంటే బస్సులుండేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది.


జంకుతున్నారు..
భిక్కనూరు పిల్లనివ్వాలంటే జంకే రోజులొచ్చాయి. ఎప్పుడైతే నిజామాబాద్, హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్డు వచ్చిందో భిక్కనూరును చూసేవారే కరువయ్యారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సు కనిపిస్తే ఒట్టు.. ఒకప్పుడు నాల్గులైన్ల రోడ్డును భిక్కనూరు మీదుగా వెళ్ల వద్దని కొందరూ అభ్యంతరం చెప్పడంతో ఎన్‌హెచ్‌ అధికారులు భిక్కనూరుకు బైపాస్‌ను ఏర్పాటు చేశారు. దీంతో భిక్కనూరు మండల కేంద్రానికి ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రావడం తగ్గాయి. దీంతో ప్రజలు పలుమార్లు  నిరసన కార్యక్రమాలు చేపట్టడం నిరాహారదీక్షలు చేశారు.  


హామీలు రెండ్రోజులకే..
ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టి బస్సులను అడ్డుకుంటే ఆర్టీసీ అధికారులు వచ్చి బస్సులున్నింటిని భిక్కనూరు మీదుగా వెళ్తాయని హామీ ఇచ్చి వెళ్తారు. ఆ తర్వాత రెండు, మూడురోజుల భిక్కనూరు మీదుగా వెళ్తాయి. అనంతరం షరామూమాలే..  బైపాస్‌ రోడ్డు మీద దిగి భిక్కనూరుకు నడుచుకుంటూ వస్తున్నారు. ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లు భిక్కనూరులో స్టాప్‌ ఉన్నప్పటికి బస్సులను భిక్కనూరు మీదుగా తీసుకెళ్లడం లేదు. కొందరూ ప్రయాణికులు డ్రైవర్లను, కండక్టర్లను నిలదీయడంతో ఆ ఒక్క బస్సు మాత్రమే భిక్కనూరు మీదుగా వెళ్తుంది. తర్వాత మళ్లీ మామూలే.

 
ప్రతిరోజూ గొడవ పడలేం..
ప్రతిరోజు ఏం గొడవ పెట్టుకుంటాం మా ఖర్మ.. అనుకుంటూ ప్రయాణికులు భిక్కనూరు స్టాప్‌ దగ్గర దిగి ఊళ్లోకి నడుచుకుంటూ వస్తున్నారు. పిల్లాపాపలను ఎత్తుకొని అంతదూరం నడుచుకుంటూ ఊళ్లోకి రావడం నరకాన్ని తలపిస్తోంది మహిళలు అంటున్నారు. కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్‌–1 నిజామాబాద్‌–2 నిర్మల్, ఆదిలాబాద్, బైంసా, బాన్స్‌వాడ, హైదరాబాద్‌ డిపోలకు చెందిన బస్సులు ప్రధానంగా వెళ్తాయి. కామారెడ్డి డిపోకు చెందిన కొన్ని ఎక్స్‌ప్రెస్‌ బస్సులు  కూడా భిక్కనూరు మండల కేంద్రం  మీదుగా వెళ్లడంలేదు.

ఎక్స్‌ప్రెస్‌లు ఆగట్లేదు..
ఎక్స్‌ప్రెస్‌ బస్సు ప్రయాణం అంటే భయమేస్తోంది. భిక్కనూరు నుంచి వేరే గ్రామాలకు వెళ్లాలంటే బస్సుల కోసం మం డల కేంద్రంలో గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తుంది. ఇక కామారెడ్డి హైదరా బాద్‌ వైపునుంచి బస్సులు బైపాస్‌ గుండా వెళ్లడంతో అక్కడి దిగి రావడం ఇబ్బందికరంగా ఉంది.  – లక్ష్మీనారాయణ ప్రయాణికుడు భిక్కనూరు.

చాలా కష్టంగా ఉంది..
మీ భిక్కనూరుకు పిల్లను ఇద్దామంటే  బస్సులు రావు ఎలా ఇ స్తాం అని అంటున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సులు రావు ఆర్డినరీ బస్సుల్లో  వెళ్దామంటే నిల్చోవడానికే జాగా ఉండదు. ఏమి చేస్తాం ఆటోల్లో పోవాల్సి వస్తుంది. అన్ని బస్సులు భిక్కనూరు మీదుగా పోయేలా చేయాలి. అప్పుడే మాకు బస్సుల కష్లాలు పోతాయి. –ప్రమీల, బీడీ కార్మికురాలు భిక్కనూరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement