కాంగ్రెస్ చేసిన పనులకు టీఆర్‌ఎస్ శంకుస్థాపన: భట్టి

సాక్షి, ఖమ్మం: నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇవ్వకుండా టీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు మున్సిపాలిటీ ఎన్నికల కోసం ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఎమ్మెల్యే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మధిరను అన్నిరకాలుగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని తేల్చి చెప్పారు. సోమవారం ఆయన ఖమ్మంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన పనులకు టీఆర్‌ఎస్ పార్టీ శంకుస్థాపన చేస్తుందని ఎద్దేవా చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి