పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి: భట్టి | Sakshi
Sakshi News home page

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి: భట్టి

Published Sun, Sep 9 2018 2:58 AM

Bhatti Vikramarka comments on Petrol prices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే భారం తగ్గే అవ కాశం ఉంటుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెట్రో భారం వేయడాన్ని ఖండిస్తూ ఈనెల 10న కాంగ్రెస్‌ తలపెట్టిన భారత్‌ బంద్‌లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

శనివారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్‌ఆయిల్‌ ధరలు 120డాలర్లు ఉన్నా..తక్కువ ధరలకే డీజిల్, పెట్రోల్‌ అందించిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు. పెట్రో ధరలు తగ్గించాల్సింది పోయి, ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని మరింత పెంచి ఇష్టారాజ్యంగా ప్రజలపై భారం వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement